కలం, వెబ్ డెస్క్ : ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీనాథ్ నియామకం అయ్యారు. ఈయన ప్రస్తుతం తెలంగాణ సీనియర్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలు వెంటనే చేపట్టాలని ఫైమా సూచించింది. డాక్టర్స్ అసోసియేషన్ కు శ్రీనాథ్ అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపింది ఫైమా. ఫైమా ఎగ్జిక్యూటివ్ కమిటీ డాక్టర్ శ్రీనాథ్ (Dr Srinath) కు ఈ బాధ్యతల విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని స్పష్టం చేసింది. ఆయన ఉన్నతంగా తన జర్నీని సాగించాలని కోరింది.
Read Also: మున్నేరు–పాలేరుతో మూడు జిల్లాల నీటి కష్టాలకు చెక్ : మంత్రి ఉత్తమ్
Follow Us On: Youtube


