కలం, వెబ్ డెస్క్ : భారత బాక్సింగ్ ఐకాన్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ (Vijender Singh)కు గౌరవమైన బాధ్యత దక్కింది. ఆసియా బాక్సింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియామకమయ్యారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లలో పతకాలు గెలిచిన ఆయన భారత బాక్సింగ్‌కు ఐకాన్‌గా నిలిచారు. నియామకంపై విజేందర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఆసియా బాక్సింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితుడవడం గౌరవంగా ఉందన్నారు. బాధ్యతను అప్పగించిన భారత బాక్సింగ్ సమాఖ్య (BFI) కి కృతజ్ఞతలు తెలియజేశారు. భారత బాక్సింగ్ వృద్ధికి, భవిష్యత్ అథ్లెట్లు గొప్ప విజయాలు సాధించేలా కృషి చేస్తాను అని తెలిపారు. విజేందర్ నియామకంతో భారత బాక్సింగ్ అభివృద్ధికి దోహదపడుతుందని క్రీడా ప్రియులు భావిస్తున్నారు.
Read Also: అర్ష్‌దీప్‌ను పక్కనబెట్టడం అన్యాయం : అశ్విన్
Follow Us On : WhatsApp


