కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసిన విధానంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాలు తనకు అస్సలు అర్థం కావడం లేదని స్పష్టం చేశాడు. జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) పాత్రపై కైఫ్ పలు ప్రశ్నలు సంధించాడు.
నితీష్ (Nitish Kumar Reddy) అసలు ఆల్‌రౌండర్ కాదని, అతను కేవలం బ్యాటర్ మాత్రమేనని అన్నాడు. అతన్ని ఆల్‌రౌండర్‌గా చూపించడం సరైన విధానం కాదన్నాడు. రాజ్‌కోట్‌లో పిచ్ స్లోగా ఉన్నప్పటికీ భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం ఆశ్చర్యం కలిగించిందన్న కైఫ్, న్యూజిలాండ్ మాత్రం ముగ్గురు స్పిన్నర్లతో పరిస్థితులను చక్కగా అంచనా వేసిందని అన్నాడు.
నితీష్ తుది జట్టులో ఉన్నప్పుడల్లా కెప్టెన్ ఒత్తిడిలో పడుతున్నాడని పేర్కొన్న కైఫ్, అతను ఆరో బౌలింగ్ ఆప్షన్ కాదని స్పష్టం చేశాడు. నిజానికి అతను పార్ట్‌టైమ్ బౌలర్ మాత్రమేనని, అవసరం కోసం మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.


