కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు (Municipal Reservations) ఖరారు చేయడంతో జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి (Metpally) పట్టణంలోని పురుషులు రిలాక్స్ అయ్యారు. మెట్ పల్లి మున్సిపాలిటీని 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 2005లో మెట్ పల్లి మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు నిర్వహించగా బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా 2010లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వు చేశారు. 2026 ఎన్నికల్లో ఎవరికి కేటాయిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ మహిళలకు రిజర్వు చేస్తే మన పరిస్థితి ఏమిటని పురుష కౌన్సిలర్లు కేవలం కౌన్సిలర్లుగా మాత్రమే ఉండాలా? చైర్మన్ అయ్యే అవకాశం రాదా? అనే మీమాంసలో ఉన్నారు. ఈ క్రమంలోనే మెట్ పల్లి (Metpally) మున్సిపల్ చైర్మన్ జనరల్ రిజర్వు కావడంతో మెట్టపల్లి నేతలు తప్పిందిరా గండం అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: 75 ఏండ్ల తర్వాత పాలమూరు జిల్లాకు సీఎం పదవి : రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


