కలం, వెబ్ డెస్క్ : కాకినాడలో గ్రీన్ కో (GreenKo) కంపెనీ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. గత ఏడాది జనవరి 6వ తేదీన గ్రీన్ అమ్మోనియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. 2027 జూన్ నాటికి 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి కాకినాడ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు ఒక చరిత్ర.. చరిత్ర తిరగరాయడంలో తెలుగు వాడు ముందున్నందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ గారు, జర్మన్ ఛాన్స్లర్ గారు చేసిన ఎంఓయు (MOU) ప్రకారం కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ (Green Ammonia Plant) వస్తుందని తెలిపారు. గ్రీన్ అమ్మోనియా మూలంగా వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుంది. కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయవచ్చని చంద్రబాబు తెలిపారు.

Read Also: గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Follow Us On: Sharechat


