హైదరాబాద్ చేరుకున్న అభిషేక్ మను సింగ్వి..

కలం, వెబ్ డెస్క్​ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు, కార్పొరేషన్ చైర్మన్ ఎం. ఏ. ఫహీమ్ స్వయంగా సింఘ్వీ దంపతులను ఆహ్వానించారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక రేపు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకే సింఘ్వీ ప్రత్యేకంగా నగరానికి చేరుకున్నారు. వివాహ వేడుక అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ పయనం కానున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>