epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

బీజాపూర్ ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోయిస్టుల మృతి

కలం, వెబ్‌ డెస్క్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur) జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు (Maoists) మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, ఘటనా స్థలం నుండి రెండు ఏకే-47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరణించిన వారిలో నేషనల్ పార్క్ (Indravati National Park) ఏరియా కమిటీ చీఫ్ దిలీప్ బెడ్జా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో కీలక మావోయిస్టు నేత, కోటి రూపాయల వరకు రివార్డు ఉన్న పాపారావు అలియాస్ మోంగు లక్ష్యంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి.  బీజాపూర్ (Bijapur) ఎన్‌కౌంటర్‌లో పాపారావు కూడా మరణించి ఉంటాడని భావిస్తున్నప్పటికీ, అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Read Also: ఆ మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>