కలం, సినిమా : వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది. వీటీ15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.
వీటీ 15 సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ చేసిన సోషల్ మీడియా పోస్ట్ లో కోక అంటే ఏంటో గ్లింప్స్ లో తెలుసుకుందాం అని పేర్కొన్నారు. కొరియన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫస్ట్ తెలుగు చిత్రమిది. హారర్ కామెడీ జానర్ లో దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్నారు. ఇది ఓ డిఫరెంట్ మూవీ. దీనిపై మెగా హీరో వరుణ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఇటీవల సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ తేజ్. అటు దర్శకుడు మేర్లపాక గాంధీకి కూడా సక్సెస్ లేదు. అయితే మేర్లపాక గాంధీ స్ట్రెంత్ కామెడీ. వరుణ్ తేజ్ కూడా ఎఫ్ 2 , ఎఫ్ 3తో తన కామెడీ టైమింగ్ ప్రూవ్ చేసుకున్నాడు. సో వీళ్లిద్దరి కాంబో మూవీ కాబట్టి సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడుతున్నాయి. ఈమధ్య వరుణ్ నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో ఈ మూవీ సక్సెస్ అవ్వడం చాలా అవసరం. మరి.. ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

Read Also: గుణశేఖర్ యుఫోరియా ట్రైలర్ ఎలా ఉందంటే..
Follow Us On: Sharechat


