కలం, సినిమా: రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ మైథాలజీ చిత్రాలు రూపొందించిన దర్శకుడు గుణశేఖర్..అంతా కొత్త వాళ్లతో యుఫోరియా అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి రాబోతోంది. యూత్ డ్రగ్స్ బారిన పడి ఎలా దారి తప్పుతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పే కథాంశంతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు గుణశేఖర్. ఈ రోజు రిలీజైన యుఫోరియా (Euphoria) ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..
ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలగంటుంది సారా అర్జున్. ఆమె ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్లిన పార్టీతో జీవితంలో ఊహించని ఇబ్బందుల పాలవుతుంది. మరోవైపు భూమిక తనపైన తనే ఓ కేసు వేసుకుంటుంది. కొడుకునో, భర్తనో చంపి ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ డ్రగ్స్ కు బానిస నేరాలు చేస్తున్న కొడుకును కన్నందుకు ఆమె కుమిలిపోతూ ఉంటుంది. డ్రగ్స్ మత్తులో హత్యాచారానికి పాల్పడుతాడు ఒక పేరున్న రాజకీయ నాయకుడి కొడుకు. ఈ డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించారు. ట్రైలర్ చివరలో భూమిక ఎవరినో కాలుస్తుంది. యువత పార్టీల పేరుతో డ్రగ్స్ కు అలవాటై తమ జీవిత కలల సౌధాల్ని ఎలా కూల్చుకుంటున్నారు అనేది యుఫోరియా (Euphoria) ట్రైలర్ లో చూపించారు.
ఇటీవల ధురందర్ సినిమాలో హీరోయిన్ గా నటించి నేషనల్ ఫేమ్ సంపాదించుకుంది సారా అర్జున్. అందుకే ఆమె క్యారెక్టర్ తోనే ట్రైలర్ బిగిన్ చేశారు. ట్రైలర్ లో ఆమెకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తన గుణ హ్యాండ్ మేడ్ ఫిలింస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిన్న సినిమా తనకు పెద్ద సక్సెస్ ఇస్తుందనే నమ్ముతున్నారు గుణశేఖర్. మరి.. ఈ సీనియర్ డైరెక్టర్ నమ్మకం నిజమౌతుందో లేదో..?


