కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ప్రకటించిన నేపధ్యంలో మెదక్ (Medak) జిల్లాలో ఆసక్తికరమైన రిజర్వేషన్లు కేటాయించారు. మెదక్ జిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు (మెదక్, రామయంపేట, నర్సాపూర్, తూప్రాన్) ఉండగా, ఈ నాలుగు మున్సిపాలిటీలు కూడా మహిళలకే కేటాయించబడ్డాయి. అందులోనూ మూడు మున్సిపాలిటీలు జనరల్ మహిళగా రిజర్వ్ కావడం విశేషంగా చెప్పవచ్చు.
మెదక్ – బీసీ మహిళ,
రామయంపేట- జనరల్ మహిళ
నర్సాపూర్-జనరల్ మహిళ
తూప్రాన్- జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి.
దీంతో ఏ పార్టీ గెలిచిన మెదక్ జిల్లాలో మున్సిపల్ పీఠంపై చైర్మన్లుగా మహిళలలే కొలువు దీరనున్నారు. మెదక్ (Medak) జిల్లా అంతా నారీమణులు మాత్రమే పరిపాలించనున్నారు. ఇప్పటికే నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మెదక్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు.
Read Also: రాహుల్ గాంధీని పిలిచి అవమానించా… జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
Follow Us On: Sharechat


