కలం, వెబ్ డెస్క్: ‘‘10 జిల్లాలను కేసీఆర్ (KCR) 33 జిల్లాలు చేసి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోయే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ మహానగరంలో గతంలో 24 సర్కిళ్లు ఉంటే 30 సర్కిళ్లు చేసుకున్నాం.. 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాం. ఇన్ని చేసినా కూడా హైదరాబాద్ అస్తిత్వాన్ని ఎప్పడు ముట్టుకోలేదు’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం కోసం బీఆర్ఎస్ శాంతి ర్యాలీ అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌ను శాశ్వతంగా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారని, శాంతి ర్యాలీకి వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
‘‘తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టినందుకు, తెలంగాణ రాజముద్ర మార్చినందుకు ప్రజలు మిమ్మల్ని క్షమించరు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేందుకు స్థానిక ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. ఇదేనా రాహుల్ గాంధీ నువ్వు చెప్పే రాజ్యంగా రక్షణ అంటే? కచ్చితంగా కోర్టులో అనుమతి తెచ్చుకుని, మరోసారి ర్యాలీ నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ (KTR) అన్నారు.
Read Also: టోల్ గేట్ల వద్ద సైరన్లతో ఫేక్ వీఐపీల హంగామా!
Follow Us On: Sharechat


