కలం వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Thungathurthi) నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయింది. అర్వపల్లి వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. శనివారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఓ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బృందం నల్గొండ (Nalgonda) నుంచి కారులో పాఠశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అర్వపల్లి (Arvapally) వద్దకు రాగానే కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయ సహకారాలు అందించారు.

Read Also: పర్మిషన్ తీసుకొని మళ్లీ వస్తాం.. సికింద్రాబాద్ ర్యాలీపై తలసాని వ్యాఖ్యలు
Follow Us On: Instagram


