కలం, వెబ్‌డెస్క్: విశ్వరాజ్ జడేజా (Vishvaraj Jadeja) (165 నాటౌట్;127 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. అతనికి తోడు కెప్టెన్ హార్విక్దేశాయ్(64;63 బంతుల్లో 9 ఫోర్లు), ప్రేరక్ మన్కడ్(52 నాటౌట్; 49 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేయడంతో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. శుక్రవారం బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 50 ఓవర్లలో 291 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అన్మోల్ప్రీత్ సింగ్(100; 105 బంతుల్లో9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్(87; 89 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 4, అంకుర్ పన్వర్, చిరాగ్ జైని చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనలో సౌరాష్ట్ర చెలరేగింది. హార్విక్ తో కలసి మొదటి వికెట్‌కు 172, ప్రేరక్తో కలసి రెండో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు విశ్వరాజ్ జోడించాడు. వీరి ధాటికి లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి మరో 10 ఓవర్లు ఉండగానే సౌరాష్ట్ర అందుకుంది. విశ్వరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఆదివారం ఫైనల్లో విదర్భతో సౌరాష్ట్ర తలపడుతుంది.

Read Also: రఫ్ఫాడించిన రాధా, రిచా.. ఆర్సీబీ హ్యాట్రిక్
Follow Us On: X(Twitter)


