కలం వెబ్ డెస్క్ : ఇరాన్(Iran)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల(Indians) రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు విదేశాంగ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైతే స్వదేశానికి తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై అధికారికంగా స్పష్టత రావడంతో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చే నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దని భారతీయులకు ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌లో సుమారు 10 వేల మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


