కలం వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh)లో మైనారిటీ(Minority)లపై హింసాత్మక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ మైనారిటీ కుటుంబంపై దుండగులు దారుణానికి పాల్పడ్డారు. కుటుంబం మొత్తాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి ఇంటికి నిప్పు పెట్టారు. సిల్హెట్(Sylhet)లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిట్టగాంగ్‌లో ఉపాధ్యాయుడిగా పని చేసే బీరేంద్ర కుమార్ డే ఇంటికి దుండగులు నిప్పంటించారు. స్థానికులు అప్రమత్తమై రక్షించడంతో వారంతా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. గత కొన్ని వారాలుగా మైమెన్ సింగ్, ఫిరోజ్‌పూర్, చిట్టగాంగ్‌లలో మైనారిటీ కుటుంబాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురిని ఆందోళనకారులు హత్య చేశారు. ప్రభుత్వం తక్షణమే తమకు రక్షణ కల్పించాలని మైనారిటీలు కోరుతున్నారు.


