epaper
Friday, January 16, 2026
spot_img
epaper

స్పిరిట్ నుంచి సంక్రాంతికి మరో అప్ డేట్..

కలం, సినిమా:  రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరోవైపు ఆయన అప్ కమింగ్ మూవీ స్పిరిట్ (Spirit) షూటింగ్ కూడా జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు స్కై రేంజ్ లో ఏర్పడుతున్నాయి. స్పిరిట్ (Spirit) సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. యానిమల్ వంటి వెయ్యి కోట్ల గ్రాసర్ తర్వాత సందీప్ వంగా ప్రభాస్ తో అదే ఫీట్ రిపీట్ చేస్తాడనే రెబల్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇటీవల స్పిరిట్ సినిమా నుంచి న్యూ ఇయర్ స్పెషల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ కూడా తన బెస్ట్ పోస్టర్ అంటూ చెప్పాడు. గతంలో స్పిరిట్ నుంచి రిలీజ్ చేసిన ఇంట్రో వీడియో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే స్పిరిట్ నుంచి రెండు అప్ డేట్స్ రాగా.. ఇక ఇప్పుడు మూడో అప్ డేట్ కూడా ఇవ్వనున్నారనే వార్త ఆసక్తి కలిగిస్తోంది.

ఈ సంక్రాంతికి స్పిరిట్ సినిమా నుంచి అప్డేట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ అప్డేట్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తిప్రి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ తో కలిసి సందీప్ వంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వచ్చే స్పిరిట్ అప్ డేట్ అయినా డార్లింగ్ ఫ్యాన్స్ లో జోష్ తీసుకువస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>