epaper
Monday, March 2, 2026
epaper

ఎన్నికలు వస్తేనే అభివృద్ధి గుర్తొస్తుందా..?

కలం, నల్లగొండ బ్యూరో: ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ది గుర్తుకు వస్తుందా ?  అని నకిరేకల్ (Nakrekal) మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. చిట్యాల పట్టణ కేంద్రంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేయడం వారికి అలవాటుగా మారిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా చిట్యాల మున్సిపాలిటీకి చేసింది మాత్రం సున్నా అని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఈ రెండేళ్లలో పట్టణానికి చేసిందేమీ లేదనీ, ఒక్క పైసా కూడా పట్టణానికి తీసుకురాలేదని పేర్కొన్నారు.

బిఆర్ఎస్ (BRS) హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 25 కోట్లతో పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం చేశామని చెప్పారు. మేము మంజూరు చేసిన పనులకు శుక్రవారం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారని తెలిపారు. రెండేళ్ల నుండి చేయని శంకుస్థాపనలు శుక్రవారం చేయడంలో ఆంతర్యం ఏమిటో పట్టణ ప్రజలు గ్రహించాలని అన్నారు.

ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు ఈ శంకుస్థాపనల డ్రామాలాడుతున్నారనీ, మేము మంజూరు చేసిన పనులకు శంకుస్థాపనలు చేయడం కాదు కొత్తగా పనులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసారు. అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని, డబ్బు సంచులతో, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆరోపించారు.

Read Also: హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్‌లో కలుపుతాం: మంత్రి పొన్నం కామెంట్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!