“ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే”.. డీలిమిటేషన్​ పై రాహుల్​ గాంధీ విమర్శలు

కలం, వెబ్​ డెస్క్​: డీలిమిటేషన్​ తీరుపై కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్​ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తీరుపై ఆయన ఢిల్లీలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. డీలిమిటేషన్​ పేరుతో బీజేపీ కొత్త మోసానికి తెరతీసిందని రాహుల్​ ఆరోపించారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల వాటా అసలు విషయం కాదని చెప్పారు. నియోజకవర్గాల హద్దులు మళ్లీ నిర్ణయించడం అంటే బీజేపీకి బ్లాంక్ చెక్​ ఇవ్వడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. వారి జనాభా పెరుగుతున్నా సీట్లు మాత్రం పెరగవని రాహుల్​ గాంధీ తెలిపారు. పార్లమెంట్​ లో 850 స్థానాల పెంపు అంటే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే నెంబర్​ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపి లోక్​ సభ స్థానాలను పెంచాలని చూస్తున్నారని విమర్శించారు. ఉమెన్స్​ రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని గుర్తు చేసిన రాహుల్ (Rahul Gandhi)​.. ప్రస్తుత సీట్లతోనే దాన్ని అమలు చేయొచ్చని స్పష్టం చేశారు.

Also Read : డీలిమిటేష‌న్‌కు స్టాలిన్ మ‌ద్ద‌తు.. ప్ర‌కాశ్ రాజ్ ఏమ‌న్నారంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>