స్విట్జ‌ర్లాండ్‌ చ‌ర్చిలో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఫారిన్ కంట్రీలో ఓ చర్చిలో అన్న‌మ‌య్య సంకీర్త‌నలు (Annamayya Keerthana) అల‌రించాయి. దీనికి విదేశీయులు సైతం కోర‌స్ ఇస్తూ భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. ఈ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న స్విట్జ‌ర్లాండ్‌లోని ఓ చ‌ర్చిలో జ‌రిగింది. అమెరికాలోని టెక్సాక్‌కు చెందిన భార‌త సంత‌తి వ్య‌క్తి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ వినీల్ గ‌రిస మ‌హ‌ల్‌ (Vineel Garisa Mahal) చ‌ర్చిలో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు పాడారు. ఆయ‌న‌ కుటుంబ నేపథ్యం, ఇండియ‌న్ మ్యూజిక్‌పై ఆయ‌న‌కున్న ఆసక్తి దీనికి ప్రేరణగా నిలిచిన‌ట్లు చెప్పారు. త‌న‌ అమ్మమ్మ ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతాన్ని పాప్ క‌ల్చ‌ర్ మ్యూజిక్‌గా రూపొందించడం ప్రారంభించిన‌ట్లు తెలిపారు. చిన్నప్పుడు త‌న పేరెంట్స్‌తో కలిసి కారులో వెళ్తున్న‌ప్పుడు భారతీయ భక్తి కీర్తనలు విన్న జ్ఞాపకాలు తన మ్యూజిక్ జ‌ర్నీపై చాలా ప్రభావం చూపాయని వినీల్‌ తెలిపారు.

నేటికీ కర్ణాటక సంగీతంతో పాటు తెలుగు, భారతీయ భక్తి గీతాలను ఫారిన్ సింగ‌ర్స్‌కు అనుగుణంగా స్వరపరుస్తూ ఇండియ‌న్ మ్యూజిక్ గొప్ప తాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న‌ట్లు చెప్పారు. వినీల్ త‌న టీమ్ కాపెల్లాతో క‌లిసి అన్న‌మ‌య్య ఫేమ‌స్ కీర్త‌న‌ల్లో (Annamayya Keerthana) ఒక‌టైన‌ బ్రహ్మమొక్కటేను చ‌ర్చిలో అద్భుతంగా ఆలపించారు. దీనికి ఎలాంటి మ్యూజిక్ లేకుండా కేవ‌లం త‌మ వాయిస్‌తోనే అంద‌ర్నీ మెస్మ‌రైజ్ చేశారు. ఇండియ‌న్ మ్యూజిక్‌, అందులోనూ తెలుగు భ‌క్తి సంకీర్త‌న‌ల‌కు అంత‌ర్జాతీయంగా ల‌భిస్తున్న గుర్తింపును, ఆద‌ర‌ణ ప‌ట్ల స‌ర్వ‌త్రా హర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. వినీల్‌ ఫారిన్‌లో సెటిల్ అయినా త‌న‌ మూలాలు గుర్తుంచుకోవ‌డం, వాటికి ఇంత గౌర‌వం ఇవ్వ‌డం అభినంద‌నీయ‌మ‌ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ మరో కొత్త పథకం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>