శాండ్‌పేపర్ వివాదంపై బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు

క‌లం, స్పోర్ట్స్: 2018 నాటి శాండ్‌పేపర్ వివాదం (Sandpaper Scandal) ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) స్పందించాడు. ఈ వివాదానికి ఇక ముగింపు పలకాలని కోరాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు వారి కుటుంబాలు కూడా అనవసర ఒత్తిడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. తన కొత్త పోడ్‌కాస్ట్ ‘దట్స్ నాట్ క్రికెట్’ ప్రారంభ కార్యక్రమంలో స్టోక్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నవారితో పాటు వారి కుటుంబాలు, స్నేహితులపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నాడు.

మీడియా ఒత్తిడి వల్ల వ్యక్తులు మానసిక ఆందోళనకు గురవుతారని తన అనుభవం ద్వారా తెలిసిందన్నాడు. 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా బాధ్యతల్లో ఉన్న నాయకత్వం ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని స్టోక్స్ వ్యాఖ్యానించాడు. అసలు ఏం జరిగిందనే పూర్తి నిజం ఇప్పట్లో బయటకు రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవల మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

2018 కేప్‌టౌన్ టెస్టులో బంతి ట్యాంపరింగ్ ప్రణాళిక గురించి జట్టులోని అందరికీ తెలుసని ఖవాజా పేర్కొన్నాడు. అంతేకాదు, కేప్‌టౌన్ టెస్టు ఒక్కటే కాకుండా ఇతర మ్యాచ్‌ల్లోనూ బంతి ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఖవాజా వాదనకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>