బుద్దవనం సందర్శించిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు

కలం, నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ లోని ప్రముఖ పర్యాటక బౌద్ధ కేంద్రం బుద్ధవనాన్ని (Buddhavanam) శుక్రవారం మిర్యాలగూడ పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయానికి చెందిన విద్యార్థులు సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ వనంలోని బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించారు. సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలు తెలియజేసే లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో విద్యార్థులతో ధ్యానం చేయించారు.

వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్, బుద్ధవనం (Buddhavanam) విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ రవి మాట్లాడుతూ.. ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా బుద్దవనం సందర్శించే విద్యార్థులకు తెలంగాణ టూరిజం బుద్ధవనం ఎంట్రన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వడం హర్షనీయమని, ఇటువంటివి ఎడ్యుకేషన్ టూర్లకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. వీరితోపాటు కేంద్రీయ విద్యాలయ అధ్యాపక బృందం రవి, దివ్యకాంత్, సతీష్, మోబిన్, షిఖా, అనూష తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>