యూపీలో భారీ ఎత్తున‌ అక్రమ మద్యం ధ్వంసం

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున లిక్క‌ర్ ధ్వంసం చేశారు. మణియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ల‌భ్య‌మైన అక్రమ మద్యంపై చర్యల్లో భాగంగా జేసీబీతో మ‌ద్యం బాక్సుల‌ను ధ్వంసం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ సమీపంలోనే పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మొత్తం 4,912 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 కేసులకు సంబంధించి పలు చోట్ల ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గతంలోనూ మణియార్ ప్రాంతంలో అక్రమ మద్యంపై పోలీసులు పలు ఈ తరహా చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాలతో 123 ఎక్సైజ్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 2,150 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అలాగే గత ఏప్రిల్‌లో ఘాఘ్రా నది సరిహద్దు ప్రాంతంలో సుమారు నాటుసారా తయారీకి ఉపయోగించే 15 వేల లీటర్ల ముడి పదార్థాల‌ను గుర్తించి ధ్వంసం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>