ఉట్నూర్ ఆసుపత్రికి వైద్య పరికరాలు మంజూరు చేయాలి: బొజ్జు పటేల్

కలం, ఉట్నూర్: ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న వైద్య పరికరాల కొరతను పరిష్కరించి, అవసరమైన పరికరాలు మంజూరు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్( Bojju Patel) రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తును కలిసి శుక్రవారం వినతిపత్రాలు అందజేశారు.

ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, గైనకాలజీ, ప్రసూతి, నేత్ర, జనరల్, దంత వైద్య విభాగాలకు అవసరమైన పరికరాలను సమకూర్చాలని కోరారు. ఉట్నూర్‌తో పాటు పరిసర మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ పరికరాలు అవసరమని వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి, వైద్యశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించి అవసరమైన పరికరాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>