కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ (Aries Agro) 57వ వార్షికోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ జోనల్ సేల్స్ మేనేజర్ నగేష్ గుప్తా, సీనియర్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఏరిస్ కంపెనీ 1969 సంవత్సరంలో ముంబైలో స్థాపించబడి ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పనిచేస్తుందని చెప్పారు. అదేవిధంగా నిజామాబాద్ లో కూడా పనిచేస్తున్నామని.. ఏరీస్ కంపెనీ వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా వృద్ధులకు, అనాధలకు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు.
అందులో భాగంగానే స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మానసిక వికలాంగులకు అంధులకు తమ సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ పి, రాజేశ్వరి, ఎస్బిఐ బ్యాంక్ ఏరీస్ కంపెనీ సీనియర్ మేనేజర్ ఈ రమేష్, సిబ్బంది సాయిలు, గణేష్, భూపతి, అభిలాష్ , ఏరీస్ కంపెనీ డీలర్ సురేష్ యాదవ్, రైతు కే శ్రీనివాస్ మానసిక వికలాంగులు, అంద విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగ బాలలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

