దీక్షా దివస్ సభను విజయవంతం చేయండి.. గంగుల పిలుపు!

కలం, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) అన్నారు. తెలంగాణ సాధన అనంతరం కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

దీక్షా దివస్‌ సభ విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్‌ రూరల్‌ మండలం చర్లబూత్కూర్‌ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పు చాటింపు కార్యక్రమంలో గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. దీక్షా దివస్‌ ఇన్‌చార్జి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి డప్పు కొట్టి ప్రజలకు చాటింపు వేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు నుదుట కుంకుమ దిద్ది, శాలువాలు కప్పి సత్కరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ గ్రామ ప్రజలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ దీక్షా దివస్‌ సభకు రావాలని ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం, చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులకు భరోసా కల్పించామని తెలిపారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోనూ పదేళ్లలో రహదారులు, తాగునీరు, సాగునీటి సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీబంధు వంటి పథకాలు యథావిధిగా కొనసాగాలంటే కేసీఆర్‌ నాయకత్వం మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, భవిష్యత్తు తరాల సంక్షేమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత

ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు, యువత, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి తో పాటు, గ్రామ శాఖ అధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, ఆకుల కిరణ్ పటేల్, తల్లూరు మాజీ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>