హిందూ మహాసముద్ర సహకారంపై మారిషస్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మంత్రుల మండలి సమావేశం (IORA meeting) 2026లో మారిషస్ విదేశీ వ్యవహారాలు, ప్రాంతీయ సమగ్రత, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఓఆర్ఏ వైస్ చైర్ హోదాలో మారిషస్ పాల్గొంటున్న తొలి మండలి సమావేశం ఇదని ఆయన తెలిపారు. మారుతున్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఐఓఆర్ఏ ప్రాధాన్యతను మరింత పెంచడానికి, విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ట్రాయికా, సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి మారిషస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానానికి హిందూ మహాసముద్రం కీలక మార్గంగా ఉందని రామ్‌ఫుల్ అన్నారు. సముద్ర భద్రత, వాణిజ్య పెట్టుబడుల సులభతరం, మత్స్య సంపద నిర్వహణ, పర్యాటకం, నీలి ఆర్థిక వ్యవస్థ, విపత్తు నిర్వహణ, విద్యా శాస్త్ర సాంకేతిక సహకారం, మహిళా ఆర్థిక సాధికారత వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అసోసియేషన్ సరైన స్థితిలో ఉందని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>