కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ ప్రత్యేక అనుమతి!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి ప్రధాని మోదీ ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. వెంటనే ఢిల్లీకి రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఆదేశించారు. తాను హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర చేపడుతున్నట్లు అమిత్ షాకు వివరించారు. ప్రధాని పర్మిషన్ తీసుకోవాలని కిషన్ రెడ్డికి సూచించడంతో.. ఫోన్ ద్వారా మోదీకి పాదయాత్ర ప్రాముఖ్యతను వివరించడంతో సమావేశం నుంచి మినహాయిస్తూ అంగీకరించారు. సాధారణంగా కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కేబినెట్ హోదా కలిగిన మంత్రులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. కిషన్ రెడ్డి ప్రస్తుతం ఇదే హోదాలో కొనసాగుతుండటంతో ప్రధాని అనుమతి తీసుకుని పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

నేటితో పాదయాత్ర ముగింపు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ భారత్ ఈ రోజుతో ముగియనుంది. ఉదయం 11 గంటలకు సత్యం థియేటర్ వద్ద ప్రారంభమై.. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వరకు సాగనుంది. అనంతరం అక్కడే ముగింపు సభ కూడా నిర్వహించనున్నారు. హీరోలు నాగార్జున, చిరంజీవి తదితరులు పలు ప్రాంతాల్లో పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని డ్రగ్స్ బారి నుంచి రక్షించుకుందామనే పిలుపుతో కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>