అక్రిడిటేషన్ కార్డుల జారీలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

జర్నలిస్టులు వృత్తి నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ (Rajarshi Shah) సూచించారు. దినపత్రికల ప్రచురణ, జర్నలిస్టుల హాజరు తదితర వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులకే కార్డులు మంజూరు చేయాలన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి కార్డులు పొందినా, అక్రిడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ, అక్రెడిటేషన్ కమిటీ కన్వీనర్ ఇ.విష్ణువర్ధన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>