2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? 2 ఎమ్మెల్సీలు ఓడగొట్టాలా?: BRS

కలం, నల్గొండ: నల్గొండ జిల్లా శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి  ఏనుగుల రాకేష్ రెడ్డీలు యువత సమస్యలు, ఉద్యోగ సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులను గురువారం అడిగి తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ ఎఫైర్స్ పుస్తకాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌లో రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ అమలులో విఫలమైందని విమర్శించారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు, డిజిటల్ లైబ్రరీలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.

ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా యువత సమస్యలపై పోరాటం ఆగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని, జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యలే ప్రధాన ఎజెండాగా మారతాయని, జాబ్ క్యాలెండర్, గ్రూప్స్, మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలు, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. “రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా? రెండు ఎమ్మెల్సీలు ఓడగొట్టాలా?” అనే నినాదం ప్రతి నిరుద్యోగ యువకుడి గొంతుక కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్ దొడ్డి రమేష్, మారగోని గణేష్, యాదయ్య, రావుల శ్రీనివాస్ రెడ్డి, గోపగోని స్వాతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>