కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న బీజేపీ (BJP) పార్టీ అధికారం కోల్పోతే చచ్చిన పాముతో సమానమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల కిందట బీజేపీ, 25 ఏళ్ల కిందట బీఆర్ఎస్ పార్టీలు లేవని విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో నియంతలా పాలన ఉండద్దనేదే బీఆర్ అంబేద్కర్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
పేదలకు ఓటు అనే ఆయుధాన్ని డా. బీఆర్ అంబేద్కర్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భారతమాత గడ్డ మీద రాచరికం చెల్లదని.. నియంతన పాలన నడవదని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. పాలకులమని విర్రవీగొద్దని.. సేవకులుగా మారి ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రజా తీర్పు పొందాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.. పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, 18 ఏళ్లు పైబడిన యువకుల చేతికి ఓటు అనే ఆయుధం ఇచ్చారని తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ (Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు సార్లు అధికారం అనుభవించిన కేసీఆర్.. ఇవాళ బయటకు రావడం లేదని దుయ్యబట్టారు. చేసిన తప్పులకు ప్రజలకు ముఖం చూపించలేకే కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదని మండిపడ్డారు. అధికారం పోగానే ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లలో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని మండిపడ్డారు.
Also Read : ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు డేట్ ఫిక్స్!
Follow Us On: Youtube

