రాజ్యాంగ హక్కులతో పాటు ప్రాథమిక విధులను గుర్తించాలి: రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ విశిష్టతను, ప్రజాస్వామ్య విలువలను స్మరించుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాల్లో ఒకటని పేర్కొన్నారు.

దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు, అందులో పొందుపరిచిన ప్రాథమిక విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.

ముఖ్యంగా యువత, విద్యార్థులు రాజ్యాంగ ఆశయాలు, విలువలను ఆకళింపు చేసుకుని సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం వంటి సూత్రాలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>