కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని(Nirmal Collectorate) సమావేశ మందిరంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) రాథోడ్ రమేష్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులతో కలిసి రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలోనూ, పౌరులకు సమాన హక్కులు, న్యాయం అందించడంలోనూ భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : హైకోర్టు సంచలన తీర్పు.. సీపీ, డీసీపీకి జైలు శిక్ష!
Follow Us On : WhatsApp

