బండి భగీరథ్‌కు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ (Bandi Bhagirath)కు మేడ్చల్ పోక్సో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28న కోర్టు ఎదుట విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

గతంలో 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించాడంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు మే 8న బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు మే 16న నిందితుడు భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసింది.

Also Read : హైకోర్టు సంచలన తీర్పు.. సీపీ, డీసీపీకి జైలు శిక్ష!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>