కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం సమక్షంలో ఓ భక్తుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి ఉదయం 8.30 గంటలకు అమరావతి నుంచి బయల్దేరి, ఉదయం 10 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రీ నిలయానికి వెళ్తారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు, పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

