హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. మరో చెరువు రెడీ!

​కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క చెరువును పునరుద్ధరిస్తూ వస్తున్న హైడ్రా త్వరలోనే మరొకటి ప్రారంభోత్సవం చేయబోతుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సున్నం చెరువు (Sunnam Cheruvu) అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లు, పార్కులు, ఓపెన్ జిమ్ పరిశీలించారు.

14 ఎకరాల నుంచి 32 ఎకరాలకు..

ఆక్రమణలు, దుర్గంధంతో నిండిపోయిన సున్నం చెరువు విస్తీర్ణాన్ని 14 ఎకరాల నుంచి 32 ఎకరాలకు పెంచారు. ఈ సందర్భంగా పలు ఆక్రమణలు తొలగించారు. అనంతరం అభివృద్ధి పనులు చేపట్టి.. పూడిక తీయించారు. ఇప్పుడు చెరువు చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల వే సిద్ధమైంది. గుట్టల బేగంపేట, నవ భారత్ నగర్ కాలనీలకు ముంపు భయం పూర్తిగా తగ్గింది. నీరు నిలిచే ప్రాంతం 9 ఎకరాల నుంచి 16 ఎకరాలకు పెరిగింది. చెరువుకు వచ్చే, వెళ్లే కాలువలను సరిచేయడంతో వరద ముప్పు కూడా ఉండదని కమిషనర్ తెలిపారు. ఇటీవలే తుమ్మిడికుంట చెరువును కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>