కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో త్వరలో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit) కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పెషల్ సాంగ్‌ను సిద్ధం చేస్తోంది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ ఆంథమ్‌ను రూపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు తెలంగాణ అభివృద్ధి, సంస్కృతితో పాటు ఇక్కడి పెట్టుబడి అవకాశాలను చాటిచెప్పే లక్ష్యంతో ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం నాలుగు భాషల్లో ఈ ప్రత్యేక గీతాన్ని తీసుకొస్తున్నారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ కొనసాగనుంది. సమ్మిట్ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ వివరాలను వెల్లడించారు. ఈ గీతంతో పాటు సమ్మిట్ ప్రారంభోత్సవ రోజైన డిసెంబర్ 7న, అలాగే డిసెంబర్ 9న జరగనున్న క్లైమేట్ కాన్సర్ట్‌లోనూ భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

