ఎమ్మెల్యే నాయినికి వినయ్ భాస్కర్ సవాల్

కలం, హనుమకొండ: రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని కాంగ్రెస్ నాయకులు దాడులు, బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్ఎస్ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) విమర్శించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఎవరి వైపు ఉన్నారో ప్రజలే తేలుస్తారని అన్నారు. ఈ నెల 22న కేటీఆర్ నిర్వహించిన సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి కాంగ్రెస్ నాయకుల్లో అసహనం మొదలైందన్నారు. ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు.

దాడులు, అక్రమ కేసులు భయపడం..

బుధవారం హనుమకొండలో దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారరు. సుమారు 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు నాలుగైదు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణను శాంతియుత ఉద్యమంతో సాధించిన తాము దాడులు, అక్రమ కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయంలోనే..

నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వరంగల్ నగరానికి కీలక అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. కాళోజీ కళాక్షేత్రం, నయీంనగర్ బ్రిడ్జి, తాజ్‌పేట ఫ్లైఓవర్ పనులు తమ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. జిల్లాల విభజనతో పరిపాలన ప్రజలకు చేరువైందని, వరంగల్ స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. రైతులకు విద్యుత్, సాగునీరు, పంటల బీమా అమలుపై పరకాల లేదా జనగామ ప్రాంతంలో రైతుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో నేతలు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>