‘వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కలం, నిర్మల్ : మాదకద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించి యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Aleti Maheshwar Reddy)  పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వికసిత్ భారత్ – 2047 సంకల్పంలో భాగంగా డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట నుంచి ముషీరాబాద్ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను, వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, లక్ష్యసాధనపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువతతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>