ధర్మపురి ప్రజలకు హరీష్ రావు అన్యాయం: మంత్రి లక్ష్మణ్ కుమార్

కలం, ధర్మారం: ధర్మపురి నియోజకవర్గ రైతులకు మేడారం రిజర్వాయర్ నుంచి సాగునీరు ఎందుకు అందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Lakshman Kumar) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవహేళనగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మేడారం రిజర్వాయర్ నుంచి మిడ్ మానేరు ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు నీటిని తరలించారని, ధర్మపురి రైతులకు మాత్రం సాగునీరు అందించలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం దానిని నెరవేర్చలేదన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసినప్పటికీ నిర్వాసితులకు పరిహారం అందించలేదని ఆరోపించారు.

మేడారం రిజర్వాయర్ నుంచి అదనపు టీఎంసీ నీటిని తీసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. చామనపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి రూ.350 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ధర్మపురి నియోజకవర్గ సాగునీటి అవసరాలను ముఖ్యమంత్రి నాయకత్వంలో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక కాలువల ద్వారా చెరువులకు నీరందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రూప్ల నాయక్, మేడారం సర్పంచ్ వీర్ పాల్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి రంజిత్ తో పాటు ధర్మారం మండల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>