వ్యవసాయ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ: తుమ్మల

కలం, వెబ్ డెస్క్: ప్రపంచ స్థాయి వ్యవసాయ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో జోడించి విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, ఎరువులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో భారీ పెట్టుబడులను (Agricultural Investments) ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ నేపథ్యంలో సచివాలయంలో వ్యవసాయం, ఎరువులు, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు వ్యవసాయ ఇన్‌పుట్స్, ఎరువుల తయారీ సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎఫ్‌ఎంసీజీ, ఆహార ఉత్పత్తుల బ్రాండ్లు, పరిశోధనా సంస్థలు, అభివృద్ధి భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు హాజరై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీఎం రేవంత్ నాయకత్వంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బలబలాలను ప్రపంచానికి పరిచడం చేయడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సమ్మిట్ అతున్నంత వేదిక అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఒక గొప్ప అవకాశమన్నారు.

తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తుమ్మల స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో వ్యవసాయం, అనుబంధ రంగాలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>