రాష్ట్రస్థాయి జానపద నృత్య పోటీలకు నిర్మల్ విద్యార్థుల ఎంపిక

కలం, నిర్మల్ : విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు ( Folk Dance) నిర్వహించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్సీఈఆర్టీ పాపులేషన్ ఎడ్యుకేషన్ సెల్ సూచనల మేరకు 2026 సంవత్సరానికి సంబంధించి ఈ పోటీలను బుధవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రాంతీయ జానపద కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

ఈ పోటీల్లో టీజీఆర్‌ఎస్ సోఫీ నగర్ పాఠశాల విద్యార్థినులు ప్రథమ బహుమతి, కేజీబీవీ నిర్మల్ రూరల్ ద్వితీయ, జెడ్పీహెచ్ఎస్ లింగాపూర్ పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి, ప్రత్యేక జ్యూరీ బహుమతిని జెడ్పీహెచ్ఎస్ తానూర్ విద్యార్థిని దక్కించుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన సోఫీ నగర్ పాఠశాల విద్యార్థినులు హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీలో నిర్వహించే రాష్ట్రస్థాయి జానపద నృత్య పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ నర్సయ్య, న్యాయనిర్ణేతలు పరమేశ్వర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>