నార్కో టెర్రరిజంపై దేశం అప్రమత్తంగా ఉండాలి: మహేశ్వర్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: డ్రగ్స్ రూపంలో కొత్త ముప్పు పొంచి ఉందని.. నార్కో టెర్రరిజంపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అంబర్‌పేట్ నుంచి ముషీరాబాద్ వరకు నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర నిర్వహించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 2029 నాటికి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. గతంలో మావోయిజం, నక్సలిజం, ఉగ్రవాదం వంటి వివిధ రూపాల్లో దేశంపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం విదేశాల నుంచి డ్రగ్స్ అక్రమంగా దిగుమతి అవుతూ ‘నార్కో టెర్రరిజం’ రూపంలో దేశానికి కొత్త ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో డ్రగ్స్ మహమ్మారి విచ్చలవిడిగా విస్తరిస్తూ యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతోందని.. యువతను లక్ష్యంగా చేసుకుంటున్న పరిస్థితులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>