ఏపీ ఖజానాకు కాసుల వర్షం.. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, ఆదాయార్జన శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు (Chandrababu) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, గనులు, రవాణా, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర సొంత రాబడి గణాంకాలను విశ్లేషించారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23 నాటికి స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

గత ఏడాది ఇదే సమయానికి నమోదైన రూ.62,604 కోట్లతో పోలిస్తే ఇది రూ.11,738 కోట్లు అదనం కావడం విశేషం. మొత్తంగా 18.7 శాతం వృద్ధి రేటుతో పాటు, రూ.1,27,506 కోట్ల వార్షిక లక్ష్యంలో ఇప్పటికే 58 శాతం ఆదాయాన్ని సాధించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఆదాయ వృద్ధిపై సీఎం చంద్రబాబు (Chandrababu) సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే వేగంతో పన్నుల వసూళ్లలో పారదర్శకతను పెంచి, ఆదాయ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా వార్షిక లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Also Read : ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. 11 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>