ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఫిక్స్.. దేశంలోనే తొలిసారిగా ఆ చట్టం!

కలం, వెబ్ డెస్క్ : ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల (AP Assembly) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలను దాదాపు 15 రోజుల పాటు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పాలనాపరమైన సంస్కరణలు, రాష్ట్ర అభివృద్ధి అజెండాగా సాగనున్న ఈ భేటీల్లో పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో సభ ఎన్ని రోజులు జరగాలి, ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ సమావేశాల్లోనే (AP Assembly)  కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలోనే తొలిసారిగా తీసుకురానున్న ‘పెట్టుబడుల రక్షణ చట్టం’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైజాగ్ లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ. 9.89 లక్షల కోట్ల విలువైన 303 ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా పరిశ్రమలకు ఇచ్చిన భూ కేటాయింపులు, ప్రోత్సాహకాల విషయంలో ఎలాంటి విధానపరమైన ఆకస్మిక మార్పులు జరగకుండా చట్టపరమైన భరోసా కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే ఈ శీతాకాల సమావేశాల్లో రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి, వాటి భవిష్యత్ కార్యాచరణపైనా సమగ్రంగా చర్చలు జరిగే అవకాశం ఉంది.

Also Read : రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>