సీఎం విజయ్‌కు లీగల్ నోటీసు..  దీపం వివాదంలో బిగ్ ట్విస్ట్!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని ప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. ఈ వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ (CM Vijay)కు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని ఆయన తన నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నెల 20న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొన్నారు. కోర్టు సూచించిన విధంగా నవంబర్ 24న నిర్దేశిత దీపథూన్‌పై కార్తీక దీపం వెలిగించలేదని నోటీసులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు దీపం వెలిగించకపోవడానికి గల కారణాలపై తమిళనాడు ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>