కలం, వెబ్ డెస్క్ : ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ 2026 (Miss Universe 2026) కిరీటాన్ని ప్యూర్టోరికో సుందరి జెన్నిఫర్ బారెట్టో (Jennifer Barreto) సొంతం చేసుకున్నారు. శాన్ జువాన్ వేదికగా జరిగిన 75వ విశ్వసుందరి తుది పోరులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. సొంత గడ్డపై, తన దేశ ప్రజల సమక్షంలో జెన్నిఫర్ ఈ ఘనత సాధించడం విశేషం.
ఏడేళ్ల చిన్నారికి తల్లి అయిన జెన్నిఫర్ బారెట్టో విశ్వసుందరిగా నిలిచి చరిత్ర సృష్టించారు. వివాహమై, పిల్లలు ఉన్న మహిళ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు జెన్నిఫర్ అమెరికా రక్షణ విభాగంలో బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఆమె ఈ అరుదైన విజయాన్ని అందుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక ఈ ఏడాది మిస్ యూనివర్స్ (Miss Universe 2026) పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కేరళ సుందరి కాజియా లిజ్ మెజో టాప్-30 జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ, ఆ తర్వాతి రౌండ్ అయిన టాప్-12లోకి ప్రవేశించలేకపోయారు. దీంతో నాలుగోసారి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకోవాలన్న భారత్ కల నెరవేరలేదు.
Also Read : మహేశ్ ఒక్క కామెంట్.. చిన్నారి రీల్‌కు 26 మిలియన్ వ్యూస్!
Follow Us On: X(Twitter)

