ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలి : కేటీఆర్ డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకుల అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖండించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా ఇతర ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయాలని చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.

వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ఈ భూములు ప్రజల ఆస్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి, ఇష్టానుసారంగా అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు.

ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరని, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం అఖిలపక్షాలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, వేలం రద్దు చేసే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read : హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అరెస్ట్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>