కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. చెత్తకుప్పలకు నిప్పంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలు మరింతగా వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బయో మైనింగ్ పనులు కొనసాగుతున్న వేళ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
Also Read : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!
Follow Us On: X(Twitter)

