బెల్‌తరోడా గ్రామాభివృద్ధికి భారీ నిధులు.. ఎమ్మెల్యే పవార్ కీలక ప్రకటన!

కలం, తానూర్: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. తానూర్ మండలం బెల్‌తరోడా (Beltaroda) గ్రామంలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న హనుమాన్ ఆలయానికి బుధవారం ఆయన భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్‌తరోడా గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.1.90 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. రూ.1,400 కోట్ల వ్యయంతో బెల్‌తరోడా నుంచి నిర్మల్ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. భైంసా పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోప సాయినాథ్, మండల బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>