వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

కలం, సినిమా: త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం-ఏకే47’(Aadarsha Kutumbam) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. ఇందులో వెంకటేశ్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక సినిమా విషయానికి వస్తే..చిట్టిబాబు (వెంకటేశ్‌) ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారంలో మోసపోవడంతో కుటుంబం అప్పులపాలవుతుంది. కొడుకు సర్వ, కూతురు సంపూర్ణ సమస్యలతో చిట్టిబాబు సతమతమవుతుంటాడు. ఇలాంటి సమయంలో అతడికి రూ.100 కోట్ల లాటరీ తగలడంతో కుటుంబం జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అద్దె ఇంటి నుంచి ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలోని హౌస్ నంబర్ 47కు మారుతుంది. అయితే, బిహార్‌కు చెందిన టార్జన్ దోపిడీ ముఠా ఈ కుటుంబంపై కన్నేయడంతో కొత్త చిక్కులు మొదలవుతాయి. అసలు ఆ ముఠా ఎవరు? చిట్టిబాబు కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? అన్నదే మిగతా కథ.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>